రామ్‌చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లని ఎంచుకొన్నారు. రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్‌లకు ఫిక్స్ చేస్తే.. అందులోంచి అనుపమని పక్కన పెట్టారు. ఆ స్థానంలో ఇప్పుడు సమంత వచ్చి చేరింది. నిజానికి చరణ్ సినిమా కోసం ముందు అనుకొన్న కథానాయిక సమంతే. కానీ.. అప్పట్లో సమంత కు సినిమాలు చేసే మూడ్ లేకపోవడంతో చరణ్ సినిమాకి ఓకే చేయలేకపోయింది. దాంతో రాశీ, అనుపమ లు టీమ్‌లోకి వచ్చారు. అయితే అనుకోకుండా… అనుపమ డ్రాప్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఆ ప్లేసులో సమంత వచ్చేసింది.
ఈనెల 30న చరణ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈనెల 29న నాగచైతన్యతో సమంత నిశ్చితార్థం. ఈ శుభకార్యం తరవాత… సమంత చేయబోయే సినిమా ఇదే. జనతా గ్యారేజ్ తరవాత సమంత ఏ సినిమాపై సంతకం చేయలేదు. చరణ్ సినిమాతోనే… సమంత మళ్లీ సినిమాలవైపు దృష్టి పెట్టినట్టైంది. ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తారు. టాప్ హీరోలందరితోనూ నటించేసిన సమంత… రామ్ చరణ్‌తో మాత్రం ఇప్పటి వరకూ పనిచేయలేదు. సుక్కుతోనూ సమంత వర్క్ చేయడం ఇదే మొదటి సారి.