సమంత ఇటీవల అనారోగ్య బారీన పడిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో షూటింగులకు దూరంగా గడిపింది. తిరిగి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. అయితే.. ఇప్పుడు మరోసారి ఆమె సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకొందని టాక్. యేడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని సమంత భావిస్తోందట. అందుకే… తీసుకొన్న అడ్వాన్సుల్ని మళ్లీ వెనక్కి ఇచ్చేస్తున్నట్టు టాక్. సమంత చేతిలో ప్రస్తుతం `ఖుషి` సినిమా ఉంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. మరో మూడు రోజులు షూట్ చేస్తే… సినిమా పూర్తవుతుంది. సమంత చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్. దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. ఇవి మినహా సమంత చేస్తున్న సినిమాలేం లేవు. కాకపోతే… కొన్ని సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు కమిట్ అయ్యింది. వాటికి సంబంధించిన అడ్వాన్సులు సమంత తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. సమంత ఆరోగ్యం మళ్లీ తిరగబడిందని, అందుకే సమంత ఈ నిర్ణయం తీసుకొందని టాక్. సమంత తన హెల్త్‌కి సంబంధించిన అప్ డేట్ తనే ఇచ్చి… తనపై ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు కూడా సమంత ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉందని తెలుస్తోంది. త్వరలోనే సమంత దగ్గర్నుంచి ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో సమంతనే క్లారిటీ గా చెప్పబోతోందని టాక్.