సమంత ట్విట్టర్లో పెట్టిన ఓ ఫొటో… ఇప్పుడు టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తోంది. సెట్లో… కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్న ఫొటో.. భలే క్యూట్‌గా ఉందని అందరూ దాని గురించే చెప్పుకుంటున్నారు. క్యార్ వాన్ అందుబాటులో ఉన్నా సరే.. ఆరు బయటే సేద తీరుతున్న సమంత సింప్లిసిటీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. ‘మహానటి’ టీమ్ మాత్రం సమంత ఫొటోపై కాస్త గరమ్ గరమ్‌గా ఉందని టాక్. సమంత పిక్… మహానటి సెట్‌లోనిది. సెట్లో తీసిన ఫొటోలు ట్విట్టర్లలో పోస్ట్ చేసుకోవడం మామూలే. కానీ అలా పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన గెటప్ రివీల్ కాకుండా చూసుకోవాలి. కానీ.. సమంత మాత్రం ఆ సంగతి మర్చిపోయింది. సెట్లో ఉన్న ఫొటోలు ట్విట్టర్లో పెట్టొద్దు అని మహానటి దర్శక నిర్మాతలు తమ టీమ్‌కి గట్టిగా చెప్పారు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్గానీ, ఇతర నటీనటులు గానీ – మహానటి సెట్ మూమెంట్స్ ఒక్కటి కూడా షేర్ చేసుకోలేదు. కానీ సమంత మాత్రం…. తన గెటప్‌ని ఇలా ట్విట్టర్ ద్వారా రివీల్ చేసేసింది. దాంతో `మహానటి` టీమ్ షాకైందని, ఈ విషయంపై సమంతని వివరణ కూడా అడిగిందని తెలుస్తోంది.