టాలీవుడ్లో టాప్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వీళ్ల పేర్లు వినిపిస్తాయి. బన్నీ – తారక్ వీళ్ల మధ్య పోటీ విపరీతంగా ఉంది. డాన్స్ విషయంలో ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరితో కలసి నటించిన సమంత మాత్రం డాన్సంటే ఎన్టీఆర్‌దే అంటోంది. బృందావనం, రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో ఎన్టీఆర్‌తో కలసి నటించింది సమంత. ఇప్పుడు జనతా గ్యారేజ్ లోనూ ఎన్టీఆర్‌తో జోడీ కట్టింది. ఆయా సినిమాల్లో ఎన్టీఆర్ డాన్స్ చూసి సమంత డంగైపోయిందట. ఎలాంటి స్టెప్ అయినా ఎన్టీఆర్సింగిల్ టేక్‌లో చేసేసేవాడని, అసలు డాన్స్ విషయంలో ఎన్టీఆర్‌కి రిహార్సల్సే అక్కర్లేదని చెబుతోంది. ఎన్టీఆర్ పక్కన డాన్స్చేయాలంటే వణుకొచ్చేస్తుందని, ఆ షివర్ ఇప్పటికీ పోలేదని అంటోంది.
ఎన్టీఆర్ డైలాగులు చెప్పే విధానం కూడా సమంతకి బాగా నచ్చుతుందట. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఎన్టీఆర్ క్షణాల్లో అర్థం చేసుకొంటాడని, ఆ డైలాగ్‌ని ఓన్ చేసుకొని.. తనదైన స్టైల్లో పలుకుతాడని ఈ విషయంలో ఎన్టీఆర్‌ని కొట్టేవాడే లేడని.. సమంత కితాబులు ఇస్తోంది. అల్లు అర్జున్ కూడా మంచి డాన్సరే అని… అయితే సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీతో కలసి డాన్స్ చేసే అవకాశం పెద్దగా రాలేదని చెప్పుకొచ్చింది సమంత.. బన్నీ ఫ్యాన్స్ హర్ట్ కాకుండా.