పెళ్లయ్యాక.. సమంత ‘రూట్’ మ్యాప్ పూర్తిగా మారిపోయింది. సినిమాల విషయంలో తొందర పడడం లేదు. ప్రయోగాలు చేస్తోంది. కమర్షియల్ టచ్ కి దూరంగా ఉన్న కథలే ఎంచుకుంటోంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమా `శాకుంతలమ్` ఒక్కటే. ఈ గ్యాప్ లో సమంత కొన్ని కథలు కూడా విన్నది. కానీ దేనికీ ఓకే చెప్పలేదు. ఒకట్రెండు బడా హీరోల సినిమా ఛాన్సులనూ… సమంత వదులుకుందని సమాచారం. ఈమధ్య మైత్రీ మూవీస్ సమంతని సంప్రదిస్తే నిర్మొహమాటంగా `నో` చెప్పిందట.
మైత్రీలోనే సమంత `రంగస్థలం` చేసింది. అందులోని రామలక్ష్మి పాత్ర సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. అయినా సరే… మైత్రీ ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించింది. పెద్ద హీరోల సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలన్నది సమంత తాజా నిర్ణయమన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. సమంత దృష్టి ఇప్పుడు పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఉందని, లేడీ ఓరియెంట్ కథలు వస్తున్నా, అందులోనూ కాన్సెప్ట్ బేస్డ్ కథలనే ఎంచుకుంటోందని, అందుకే స్టార్ హీరోల కమర్షియల్ కథలను పక్కన పెడుతోందని తెలుస్తోంది. తమిళ నాట నయన తార కూడా ఇలానే చేసింది. స్టార్ హీరోల పక్కన ఛాన్సులొస్తున్నప్పుడే… వాటిని పక్కన పెట్టి, లేడీ ఓరియెంటెడ్ పై దృష్టి పెట్టింది. సూపర్ స్టార్ అయ్యింది. సమంత ఆలోచన కూడా అదే కావొచ్చు.