సమంతపై చాలా కాలం క్రితమే ఓ రూమర్ బహు ప్రచారంలో ఉంది. అదేంటంటే.. సమంత తన తల్లి దండ్రులకు దూరంగా ఉంటోందని, అస్సలు వాళ్ల గురించి పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్లో కూడా పలకరించడం లేదని ఓ టాక్ బలంగా వినిపించింది. ఓసారి సమంత తల్లిదండ్రులు కూడీ మీడియా ముందుకొచ్చి… `సమంత మా ఇంటికి వచ్చి చాలాకాలం అయ్యింది` అన్నారు. సమంత ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోంది. షూటింగ్‌లు ఉన్నా, లేకున్నా చెన్నైకి మాత్రం వెళ్లడం లేదు. సమంత తల్లిదండ్రులు ఉండేది చెన్నైలోనే. కాబట్టి.. తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశమే లేదు. సమంతకీ ఫ్యామిలీకీ మధ్య దూరం బాగా పెరిగిపోయిందన్న పుకారుకి ఇది మరింత బలం చేకూర్చింది.
అయితే… లేటెస్టుగా సమంత తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూస్తే మాత్రం సమంత ఫ్యామిలీకి టచ్‌లోనే ఉన్నట్టు అర్థం అవుతోంది. మాతృదినోత్సవం సందర్భంగా సమంత ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే… సమంతపై వచ్చింది రూమరే అనిపించకమానదు. సమంత తన ఫ్యామిలీని కొంతకాలం దూరం పెట్టిన మాట వాస్తవమే అని, ప్రస్తుతం అన్నీ సర్దుకొన్నాయని సమంత సన్నిహితులు చెబుతున్నారు. సో.. తన పెళ్లికి ముందు సమంత అన్నీ బాగానే సర్దుకొంటోందన్నమాట. ఈ అనుబంధం మున్ముందూ ఇలానే కొనసాగాలని కోరుకొందాం.
All the good in me comes from you .Thankyou #happymothersday #strongerthanthestrongest pic.twitter.com/wHjryPNXix
— Samantha (@Samanthaprabhu2) May 14, 2017