సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆమె నటించిన యశోద ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ బావుంది. అయితే ఇందులో సమంత అందం గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. సమంత అందం తగ్గిందని, విడాకులు, తర్వాత మయోసైటిస్ వ్యాధి ఆమెను క్రుంగదీశాయని కొందరు కామెంట్లు పెట్టారు. అయితే ఈ కామెంట్లపై సమంత స్పందించింది.
‘నా లాగా కొన్నినెలల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటున్నాను. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. సమంత సమాధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ”కొందరు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని, సోషల్ మీడియా వేదికని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుకుంటున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. కాగా సమంత నటించిన‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది.