రంగస్థలంలో రామలక్ష్మికి మంచి మార్కులు పడ్డాయి. అప్పట్లో జెస్సీలా, రామలక్ష్మి పాత్ర కూడా గుర్తుండిపోయేదే. అయితే ఈ సినిమాలో ఓ ఘాటైన ముద్దు సీన్ కూడా ఉంది. ఓ సన్నివేశంలో రామ్‌చరణ్‌కి సమంత లిప్ లాక్ ఇస్తుంది. ఆ వెంటనేచరణ్ కూడా సమంత పెదాలపై ముద్దు పెట్టేసుకుంటాడు. పెళ్లయ్యాక కూడా లిప్‌లాక్ సీన్లలో నటించడంపై అక్కినేని అభిమానులు ఎలా స్పందించారు? వాళ్లేమైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు సమంత ఘాటు సమాధానమే ఇచ్చింది.
”లిప్ లాక్ అనే ప్రశ్నని పెళ్లయిన కథానాయకల్ని అడిగినంత ఈజీగా పెళ్లయిన కథానాయకుల్ని అడగరేంటి?’ అంటూ హీరోలపై కౌంటర్ వేసింది. ”ఇది పక్కా ప్రొఫెషన్. అలానే చేయాలి. దర్శకుడు నాకు సీన్ చెప్పి ఒప్పించగలిగారు. `చేస్తే చేద్దాం.. నీ ఇష్టం” అన్నారు. నాకు ఆ సీన్లో లిక్ లాక్ ఉండడం సమంజసం అనిపించింది.. చేసేశాను“ అంది.
అయితే అది నిజంగా లిప్ లాక్ కాదట. కెమెరా ట్రిక్ అట. చరణ్ బుగ్గపైనే ముద్దు పెట్టా.. అది లిప్‌లాక్ లా అనిపించిందంతే.. అంటోంది సమంత. మొత్తానికి సమంత లిప్‌లాక్‌పై ఉన్న అనుమానాల్ని తన సమాధానంతో పటాపంచలు చేసేసింది.