పాపం.. సమంత! ఆమె చుట్టూ ఎన్ని హాట్ హాట్ న్యూస్లో. సమంత ప్రేమాయణం ఇప్పుడు మరో హాట్ టాపిక్. సమంత పెళ్లి, ఆమె ప్రియుడు గురించి టాలీవుడ్ జనం రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు. మీడియా హాట్ హాట్ విషయాల్ని బయటపెడుతోంది. దాంతో సమంత కూడా గుర్రుగానే ఉంది. ‘అమ్మో.. పేపర్ చూడాలంటే భయం వేస్తోంది. ఈ రోజు నా గురించి ఏం రాశారా అన్న టెన్షన్ పెరిగిపోతోంది. అమ్మయ్య ఈ పేజీలో లేదు కదా, ఈ పేజీలో లేదు కదా.. అని తిప్పుకొంటూ వెళ్తే చివరి పేజీలో అయినా నా గురించి ఏదో ఒకటి రాస్తున్నారు. మన మీడియా.. మరీ అంత మంచిదేం కాదు.. ‘ అని చెప్పుకొచ్చింది సమంత.
ఈ రోజు అ.ఆ కు సంబంధించి సమంత ఇంటర్వ్యూ ఇచ్చింది. అక్కడా సమంత పెళ్లి గురించే టాపిక్. ”ఈ ప్రెస్ మీట్లో కేవలం అ.ఆ గురించే మాట్లాడండి. నా పెళ్లి గురించి అయితే నేనే ప్రెస్ మీట్ పెడతా. అప్పుడు మరింతగా మాట్లాడుకొందాం.. నా పెళ్లికి అందరికీ శుభలేఖలు కూడా పంపుతా. ప్రత్యేకంగా మీడియా వాళ్లకు” అంటూ కాస్త వెటకారంగా మాట్లాడింది. పెళ్లి గురించి ఎంత అడిగినా నోరు విప్పలేదు. కానీ.. పెళ్లయ్యాక సినిమాలకు దూరం కాను.. నటిస్తూనే ఉంటా అంది. అదీ సమంత పెళ్లి మేటర్.