బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో అందరి దృష్టినీ ఆకర్షించింది మహేష్‌బాబు తనయ సితార. మహేష్ కూడా ‘ఈ ఆడియో ఫంక్షన్‌ని మా పాప సితార వచ్చింది.. అంతా మంచే జరుగుతుంది’ అంటూ సెంటిమెంట్ డైలాగు వదిలాడు. సమంత అయితే.. సితారతో ఎన్ని కబుర్లు చెప్పిందో?? సితారతో కాసేపు మాట్లాడిందో లేదో.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. ఈ విషయాన్ని సమంతనే చెప్పింది. అంతేకాదు.. గౌతమ్ కంటే సితార చాలా యాక్టివ్గాఉందని, గౌతమ్ హీరో అవుతాడో లేదో తెలీదుగానీ సితార మాత్రం పెద్ద హీరోయిన్ అయిపోవడం ఖాయమని జోస్యం చెప్పింది.
”సితార చాలా యాక్టివ్‌గా ఉంది. తన స్మైల్, డాన్స్ చూసి మెస్మరైజ్ అయిపోయా. ఇద్దరం స్నేహితులు అయిపోయాం. ఈ మాట వింటే… మహేష్ నన్ను కిల్ చేస్తారేమో..” అంటూ తెగ ఇదైపోతుంది సమంత. ఇది ఆమె మాటే కాదు.. సితారని చూసినోళ్లంతా అదే అంటున్నారు. సితార కాబోయే హీరోయిన్ అంటూ డిక్లేర్ చేస్తున్నారు. మరి మహేష్ ఏమంటాడో?