పెళ్లయ్యాక సమంత సినిమాలు చేస్తుందా?? మానేస్తుందా?? సమంత గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా, ఈ ప్రశ్న చర్చకు రావాల్సిందే. సమంత కూడా ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉంది. పెళ్లయ్యాక… తాను సినిమాల్ని కొనసాగిస్తానని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ”ఓ టీచర్, ఓ డాక్టర్ పెళ్లయ్యాక కూడా తమ వృత్తుల్ని కొనసాగిస్తారు కదా?? సినిమా కూడా ఓ వృత్తి అయినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు” అంటూ తన ఉద్దేశ్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది సమంత.
ఈమధ్య ఫొటో షూట్లతో అలజడి రేపుతోంది సమంత. సినిమాలు మానేసే ఉద్దేశమే ఉంటే… ఈ ఫొటో షూట్ లలో ఎందుకు పాల్గొంటోంది? అంత ఘాటుగా ఎందుకు కనిపిస్తుంది?? నిజానికి ఈ మధ్య సమంత సినిమాల్ని కాస్త తగ్గించుకొంది. దానికి కారణం.. పెళ్లికి తన సినిమాలు అడ్డు రాకూడదనే. పెళ్లి కి ముందు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, ఆ తరవాత కొంత విరామం తీసుకొని, మళ్లీ సినిమాల్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉంది సమంత. పెళ్లయ్యాక తనకు అవకాశాలు వస్తాయో రావో అని.. ముందుగానే ఫొటో షూట్లతో జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. `నాలో అందం తగ్గలేదు సుమా` అంటూ హింట్ ఇస్తోంది. సో… సమంత సినిమాల్ని కంటిన్యూ చేయబోతోందన్నమాట.