కె.రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయన తనలోని కొత్త కోణాన్నిచూపించబోతున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘవేంద్రరావు ప్రధాన పాత్రధారి. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. ఆ పాత్రలు సమంత, శ్రియ, రమ్యకృష్ణలకు దక్కనుందని టాక్.
నిజానికి తనికెళ్ల భరణి.. ఓ ప్రయోగాత్మక కథ ని రాసుకున్నార్ట. అయితే దానికి కొన్ని కమర్షియల్ హంగులూ జోడించాలని భావించడంతో – ఈ ముగ్గురు హీరోయిన్లకూ చోటు కల్పించారని తెలుస్తోంది. సమంత, శ్రియలవి దాదాపుగా అతిథి పాత్రలే. రమ్యకృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగబోతోందని టాక్. 2021 లో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. 2021 చివర్లో విడుదల కానుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. నిజానిజాలేమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.