ఏదైనా ఓ మాట మాట్లాడుతున్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అందునా సెలబ్రెటీలు ఏది పడితే అది మాట్లాడేయడం కుదరదు. నీట్‌గా మాట్లాడితేనే బూతులు వెదుకుతున్నారు. ఇక బూతులే మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఈ విషయం సమంతకు అర్థం కావడం లేదు. అందుకే టంగ్ స్లిప్ అవుతోంది. ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా తన ‘అండర్వేర్’ గురించి ప్రస్తావించి అందర్నీ షాక్‌కి గురిచేసింది సమంత. మీరు బయటకు వెళ్తున్నప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్లే వస్తువు ఏదీ? అని ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా స్ర్కిన్ కేర్ ఐటెమ్స్, మెడికేషన్, గుడ్ అండర్ వేర్ అంటూ ట్వీట్ చేసింది.
మరీ లో దుస్తుల గురించి బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సమంత ఇలా మాట్లాడకుండా ఉండకూదని చాలామంది అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఏదో మూడ్ ఆఫ్‌లో ఉండి ఈ సమాధానం చెప్పిఉంటుందేమో అని మరికొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఎంత మూడ్ ఆఫ్‌లో ఉన్నా.. ఇలాంటి విషయాలు బయటపెడతారా?? సమంత కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిదేమో??