సమంత ఖాతాలో మరో మంచి పాత్ర పడిపోయింది. మరో బయోపిక్ సమంత చేతికి చిక్కింది. త్వరలోనే సమంత బెంగళూరు నాగరత్నమగా మారబోతోందని సమాచారం. సింగీతం శ్రీనివాసరావు బెంగళూరు నాగరత్నమ్మ అనే దేవదాసి కథని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుగు 360 ఇది వరకే చెప్పింది. ఇది మరో లేటెస్ట్ అప్ డేట్. సింగీతం మదిలో బెంగళూరు నాగరత్నమ్మ పాత్ర కోసం మెదులుతున్న పేర్లలో సమంత తొలి స్థానంలో ఉంది. ముందు సమంతని సంప్రదించిన తరవాతే… మిగిలిన కథానాయికల పేర్లు పరిశీలించాలని సింగీతం భావిస్తున్నార్ట. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక.. చిత్రబృందం సమంతని సంప్రదిస్తుందని టాక్. సమంతకూ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ కథానాయికల పాత్రల్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. కథ వింటే.. తప్పకుండా ఈ సినిమా ఓకే చేస్తుందని దర్శక నిర్మాతలు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇక సమంత చేతుల్లోనే ఉందంతా.