ఓ బేబీతో ఓ మంచి హిట్టు కొట్టింది సమంత. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇప్పుడు సమంత పేరు కూడా పరిశీంచొచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిపించింది సమంత. ప్రస్తుతం తన చేతిలో `96` రీమేక్ ఉంది. ఇది వరకే ఒప్పుకున్న ఒకట్రెండు సినిమాలు పట్టాలెక్కాల్సివుంది. అయితే.. ఇవి మినహా సమంత మరో సినిమా ఒప్పుకోవడం లేదు. ఇటీవల ఒకరిద్దరు కొత్త దర్శకులు సమంతని సంప్రదించారు. కనీసం కథ వినడానికి కూడా సమంత ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు కొత్త కథలు ఏవీ వినకూడదని, కొత్త సినిమాలు ఒప్పుకోకూడదని సమంత భావిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సమంత – ఇప్పుడు తనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని చూస్తోందని, అందుకే కొత్త సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని, చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తోందని సమాచారం.