నిన్నా మొన్నటి వరకూ గ్లామర్ పాత్రలకు పరిమితమైన సమంత ‘యూటర్న్’తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ న్యాయం చేయగలనని నిరూపించుకుంది. వసూళ్లతో పాటు రివ్యూలు కూడా పాజిటీవ్‌గా రావడంతో… సమంత హ్యాపీగా ఉంది. యూటర్న్ ఇచ్చిన ధైర్యమో ఏమో… గ్లామర్ పాత్రలకు, రెగ్యులర్ కథలకు కాస్త విరామం ఇచ్చి, ఇప్పుడు పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి నిలపాలని చూస్తోంది. అందులో భాగంగా సమంత నందినిరెడ్డి కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. వీరిద్దరి కాంబోలో త్వరలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నట్టు టాలీవుడ్ టాక్. ఈ చిత్రాన్ని సురేష్‌ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే అవకాశాలున్నాయి. ఇదో లేడీ ఓరియెంటెడ్ కథని, తమిళంలో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పెళ్లయ్యాక నాగచైతన్యతో కలసి తొలిసారి ఓ చిత్రంలో నటిస్తోంది సమంత. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ అయ్యకే నందినిరెడ్డి సినిమా మొదలెడుతుందట.