చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది సమంత. శాకుంతలమ్, యశోద.. విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ లోనూ ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పుడు సమంత అమెరికా వెళ్లింది. దానికి ప్రత్యేక కారణం ఉంది. అక్కడ ఆమెకు చిన్నపాటి సర్జరీ జరగబోతోందని టాక్. సమంతకు ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. మెహంపై చిన్న చిన్న బొడిపెల్లాంటివి మెలిశాయి. అవి చూడ్డానికి ఇబ్బందిగా తయారయ్యాయి. అందుకే సమంత కొన్ని రోజులుగా షూటింగులన్నీ ఆపేసింది. విజయ్ దేవరకొండతో చేస్తున్న `ఖుషి` సినిమాకి ఈనెల 5 నుంచి డేట్లు ఇచ్చింది సమంత. కానీ… షూటింగుకి రాలేదు. దాంతో సమంత లేని సీన్లు షూట్ చేసుకొంది చిత్రబృందం. ఈనెల 15 నుంచి షూటింగ్‌కి వస్తానని సమంత మాటిచ్చింది. కానీ.. 15 నుంచి కూడా ఆమె షూటింగుకు రాలేదు. ఇప్పుడు అమెరికాలో.. స్కిన్ ఎలర్జీకి సంబంధించిన చికిత్స తీసుకుంటోందని, చిన్నపాటి ఆపరేషన్ అవసరమైందని తెలుస్తోంది. సర్జరీ అయిన తరవాత.. సమంత అమెరికా నుంచి తిరిగొస్తుందని, ఆ తరవాత యధావిధిగా షూటింగులు మొదలవుతాయని తెలుస్తోంది.