సమంత – నందిని రెడ్డి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి కాంబినేషన్లో `జబర్దస్త్` వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. `కల్యాణ వైభోగమే`తో నందిని రెడ్డి కాస్త తేరుకున్నా, స్టార్ హీరోల నుంచి ఆమెకు అవకాశాలు రాలేదు. ఈ దశలో సమంత మరోసారి నందినికి ఛాన్స్ ఇచ్చింది. `మిస్ గ్రానీ`ని రీమేక్ చేసే బాధ్యత నందిని చేతిలో పెట్టింది. ఈ సినిమా ఇప్పుడు హిట్టై.. అటు సమంతకు, ఇటు నందినికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి సమంత – నందినిల కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని టాక్. `ఓ బేబీ` జరుగుతున్నప్పుడే సమంతకు ఓ కథ వినిపించింది నందిని. `ఓ బేబీ` హిట్టయితే తప్పకుండా మరోసారి కలిసి పనిచేద్దాం అని సమంత కూడా మాటిచ్చినట్టు సమాచారం. ఇదో థ్రిల్లర్ చిత్రమని, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. అన్నీ కుదిరితే.. ఈ సినిమాతో సమంత తన ప్రొడక్షన్ కూడా మొదలెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.