ఐబిజా… స్పెయిన్‌లో ఓ ఐలాండ్! ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు ఆ ఐలాండ్‌లోనే వున్నారు. కొన్ని రోజులు అక్కడే వుంటారు. ఇద్దరూ తమ తమ సినిమా పనులను పూర్తి చేసుకుని ఆదివారం అక్కడికి చెక్కేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూటర్న్’ ఈ నెల 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఓ సినిమాకి రివ్యూలు సరిగా రాలేదు. కాని కలెక్షన్స్ పర్వాలేదని అనిపించాయి. ఓ సినిమాకి మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ సరిగా రాలేదు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు సినిమాలకు ప్రమోషన్ చేసి వెకేషన్‌కి వెళ్ళారు. చైతూ, సమంత దంపతులతో పాటు అఖిల్ అక్కినేని, సమంత స్నేహితురాలు నీరజ కోన, కొంతమంది స్నేహితులు ఈ ట్రిప్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ ఫెస్టివల్స్ గట్రా చూసుకుని నెలాఖరుకి లేదా అక్టోబర్ తొలివారంలో ఇండియాకి రానున్నారు. వచ్చీ రాగానే శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ జంటగా నటించబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.