సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) గ్లింప్స్ అందరినీ షాక్‌లో పడేసింది. ఇందులో తేజ్ మేకొవర్ ఫ్యాన్స్‌కి నచ్చింది. ఇదివరకెప్పుడూ చూడని అవతార్ ఇది. కండలు తిరిగిన దేహంతో.. మెస్మరింజ్ లుక్‌తో ఆకట్టుకొన్నాడు. నిజానికి తేజ్‌లో చాలా క్యాలిబర్ ఉంది. కానీ వాటిని బయటపెట్టే పాత్రలే సరిగా పడలేదు. ‘విరూపాక్ష’ లాంటి హిట్ తరవాత తేజ్ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే. తనకు తగిన కథ కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశాడు. ఆ నిరీక్షణ ఈ సినిమాతో ఫలించినట్టే కనిపిస్తోంది.
స్వాతంత్ర్య కాలం నాటి కథ ఇది. 1947 నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 300 కథకీ, అందులోని పాత్రలకూ.. ఈ సినిమాకూ సంబంధం ఉందని ఇన్సైడ్ వర్గాల టాక్. 300 స్ఫూర్తితోనే కొత్త దర్శకుడు రోహిత్ ఈ కథని రాసుకొన్నాడట. 300 మంది కలిసి, క్రూరమైన, అతి భారీ శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నది 300 కథ. ‘సంబరాల ఏటి గట్టు’ కూడా అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అని తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు 70 శాతం బడ్జెట్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకే ఖర్చు పెట్టినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దాన్ని బట్టి యాక్షన్‌కి ఎంత పెద్ద పీట వేశారో అర్థం అవుతోంది.
హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్లు వేశారు. దాదాపు రూ.120 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. తేజ్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రమిది. `విరూపాక్ష` తేజ్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమది. ఇప్పుడు దానికి మించి `సంబరాల ఏటి గట్టు` కోసం ఖర్చు చేస్తున్నారు.