డాక్టర్ బి. సాంబశివారెడ్డిని… ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్గా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. కొద్ది రోజులుగా చాలా గౌరవనీయ నియామకాలు జరుగుతున్నాయి…కాబట్టి.. అందులో ఇది ఒకటి అనుకోవచ్చు కానీ.. సాంబశివారెడ్డికి ప్రత్యేకత ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడూ పని చేయలేదు. కానీ.. వైఎస్ జగన్కు మాత్రం.. వైద్యం చేశారు. అనితర సాధ్యమైన వైద్యం చేశారు. అందుకే.. ఆయనకు ఆ పదవి లభించింది. ఇంతకీ ఆయన చేసిన వైద్యం ఏమిటో తెలుసా… వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి ఘటనలో.. అర అంగుళం మేర అయిన గాయాన్ని మూడున్నర అంగుళాల మేర పెంచి… రెండు వారాల పాటు జగన్ మోహన్ రెడ్డికి చికిత్స అందించడం.
కోడికత్తి గాయాన్ని మూడు వారాల్లోనే డాక్టర్ సాంబశివారెడ్డి తగ్గించగలిగారు. హైదరాబాద్ సిటి న్యూరో సెంటర్ ఆస్పత్రిలో సాంబశివారెడ్డి పని చేస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేయడంతో అయిన కోడి కత్తి గాయానికి విశాఖ ఎయిర్ పోర్టులో చికిత్స చేయించుకుని… హైదరాబాద్ చేరుకున్న జగన్ నేరుగా వచ్చి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. వెంటనే సాంబశివారెడ్డి ఐసీయూలో జగన్ ను చేర్చి చికిత్స చేశారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పి.. రెండు రోజులు చికిత్స చేసి.. రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి పంపించారు. తర్వాత జగన్ ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించారు.
జగన్కు చికిత్స చేసిన సందర్భంలో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ..” 3.5 సెంటీమీటర్ల లోతైన గాయం కనుక జగన్ భుజానికి శస్త్రచికిత్స చేసినపుడు కండరంలో కొంత భాగాన్ని తొలగించామని అందువల్ల మానడానికి సమయం పడుతుందని” స్టేట్మెంట్ ఇచ్చారు. అంత గొప్ప వైద్యం చేసిన సాంబశివారెడ్డికి ఫీజు ఇస్తే… కృతజ్ఞత ఉండదనుకున్నారేమో కానీ.. ఏకంగా ఏపీ వైద్య మండలికి చైర్మన్గా చేసేశారు. ఆయన ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. ఆ విధంగా మరో పదవి భర్తీ అయిపోయినట్లయింది.