సినిమా హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది? తెరపై అందాలు ఆరబోసే వాళ్లు తెర వెనుక ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగించే అంశాలే. సమాజంలో ఎక్కువ శాతం మందికి సినిమా తారలపై ఓ విధమైన చెడు అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లపై. సినిమా ప్రపంచంపై! దీన్ని ఒక్క డైలాగుతో ప్రశ్నించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘సినిమాలే డర్టీయా? మిగతా ప్రపంచం మొత్తం క్లీన్ ఆ?’ అంటోంది ఆయన హీరోయిన్ అదితి రావ్ హైదరి. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సమ్మోహనం’. ఇందులో అదితి రావ్ హైదరి హీరోయిన్. సినిమాలోనూ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. ఓ అబ్బాయితో ప్రేమలో పడిన ఆ హీరోయిన్ కథే ఈ సినిమా. ‘ఖడ్గం’లో కృష్ణవంశీ హీరోయిన్ల లైఫ్ గురించి, హిందీ సినిమా ‘ఫాషన్’లో మధుర్ భండార్కర్ మోడల్స్ లైఫ్ గురించి డిస్కస్ చేశారు. సేమ్ టాపిక్ ని క్లాస్ సినిమాలు తీసే ఇంద్రగంటి అదే తరహాలో చెప్పడానికి ప్రయత్నించినట్టు టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. ఆయన ఎలా తీశారో మరి? టీజర్లో అదితి రావ్ హైదరి డబ్బింగ్ మాత్రం బాగోలేదు. మారిస్తే బెటర్!