Sammohanam Theatrical Trailer
అనగనగా ఓ హీరోయిన్. ఓ సాధారణమైన అబ్బాయిని ఇష్టపడుతుంది. అతనికేమో సినిమావాళ్లపై నమ్మకం ఉండదు. పైకి ఎదగడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారన్నది అతని అభిప్రాయం. వాళ్ల నవ్వు, నటన, ప్రేమ అన్నీ భూటకమే అని నమ్ముతాడు. మరి.. వీరిద్దరికీ ఎలా కుదిరింది? వీళ్ల స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిందా, లేదా? ‘సమ్మోహనం’ కథా కమామిషు ఇదే. టీజర్లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఏం చెప్పాడో.. ట్రైలర్లోనూ అదే చెప్పాడు. కాకపోతే ఇంకాస్త డిటైల్డ్‌గా. ఇంద్రగంటి కట్ చేసిన షాట్లు, రాసుకున్న డైలాగులు చూస్తే.. కచ్చితంగా ఇది సినిమాపై సెటైరే అనిపిస్తోంది. నిజాయతీగా ఎదిగిన ఓ కథానాయిక – తన నిజాయతీని నిరూపించుకోవడానికి ఏం చేసింది? అనే పాయింట్‌పై సాగే కథ ఇది. చివర్లో కౌంటర్ చూస్తే.. రివ్యూలపైనా ఇంద్రగంటి సెటైర్ వేశాడనిపిస్తోంది. సినిమా నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చాయి. అవన్నీ సినిమా లోలోపల సంగతుల్ని చెప్పడానికి ప్రయత్నించాయి. ఇంద్రగంటి కూడా అదే దారిలో వెళ్తున్నాడనిపిస్తోంది. ఇంద్రగంటి కథల్లో డెప్త్ ఉండకపోవొచ్చు. కానీ సెన్సిబులిటీస్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. స్వతహాగా మంచి రచయిత. ఈసారి కలానికీ బాగానే పనిచెప్పాడనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే.. ఈ సీజన్లో వస్తున్న సినిమాల్లో ‘చూడక తప్పని’ లిస్టులో సమ్మోహనం ని చేర్చొచ్చు అనిపిస్తోంది.