గురువారం రిలీజ్ అయిన సంపత్ నంది, మాస్ మహరాజ్ కలయికల సినిమా ‘బెంగాల్ టైగర్’.. సినిమా మాస్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉన్నా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం తలలుఇ పట్టుకుంటున్నారు. ఒకరకంగా కిక్-2 కన్నా రవితేజకి ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుందని సంతోష పడొచ్చు. ఇకపోతే రచ్చ తర్వాత 3 ఏళ్లు టైం తీసుకున్న సంపత్ మళ్లీ అలాంటి సబ్జెక్ట్ తోనే రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఆ సినిమాలో కూడా హీరో బెట్ కట్టి విలన్ కూతురిని లైన్లో పెట్టి ఆమెకు సెక్యురిటీగా ఉంటాడు.
దీనిలో కూడా సామాన్య మానవుడిగా ఉన్న తాను మినిస్టర్ మీద రాయేసి ఫేమస్ అవ్వడం కోసం హోం మినిస్టర దగ్గర పనిచేస్తూ సి.ఎం కూతురికి లైన్ వేస్తాడు. ఇక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామస్మరణ బాగా ఎక్కువైందని చెప్పొచ్చు. సంపత్ రచ్చ తర్వాత సర్ధార్ సినిమాకి దర్శకుడిగా కొద్ది రోజులు ప్రి ప్రొడక్షన్ వర్క్ లో పాలుపంచుకున్నా పవన్ అభిరుచికి సంపత్ టేకింగ్ సరిపోదని చిన్నగా బయటకు పంపించాడు.
పవర్ స్టార్ కాదు పొమ్మన్నా సరే.. తన సినిమాలో ఆయన్ను పొగుడుతూ కాకా పడుతున్నాడు సంపత్ నంది. ఈ సినిమా కథ, కథనాల్లో లోపాలటుంచితే హీరో ఇమేజ్ కి ఎటువంటి భంగం కలగకుండా సినిమా తీయడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు డైరక్టర్ సంపత్ నంది. మరి సారు ‘చోటామేస్త్రీ’ అంటూ రామ్ చరణ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు మరి మెగా పవర్ స్టార్ సంపత్ నందికి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.