అదేంటో కొంతమంది దర్శకులు హిట్లు కొడతారు గానీ, వాటిని అవకాశాలుగా మార్చుకోవడంలో విఫలం అవుతుంటారు. ఏమైంది ఈ వేళ తరవాత రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడు సంపత్. రచ్చ హిట్టయ్యింది. ఆ తరవాత దర్శకుడిగా రెండేళ్ల గ్యాప్ వచ్చేసింది. మరో దర్శకుడైతే ఆ రెండేళ్లలో మూడు సినిమాలు చేసేవాడు. బెంగాల్ టైగర్ కూడా కమర్షియల్ గా సక్సెస్కొట్టేసింది. కానీ.. ఆ తరవాత మరో సినిమా లేదు. కొంతమంది హీరోల్ని కలిసి కథలు చెప్పినా ఏదీ వర్కవుట్ కాలేదు. మళ్లీ చరణ్ తో సినిమా చేయాలని కూడా గట్టిగా ప్రయత్నించాడు. అదీ కుదరల్లేదు. ఇప్పుడు నితిన్ వెంట తిరుగుతున్నాడు. నితిన్ కి ఓ కథ చెప్పి ఓకే అనిపించుకొన్నాడు.కానీ.. ఇప్పటి వరకూ ఆ ప్రాజుక్టు కార్యరూపం దాల్చలేదు. నితిన్ కూడా చూద్దాం.. చేద్దాం అంటున్నాడు తప్ప తేల్చి చెప్పడం లేదట. నితిన్ కూడా పవన్ లా వెంట తిప్పించుకొని నో అంటాడేమో అన్నది సంపత్ భయం. ఇప్పటికైనా ఏదో ఓ హీరోతో సెట్టవ్వకపోతే సంపత్‌కు కష్టమే. మిగిలిన దర్శకులంతా వరుసగా సినిమాలు చేస్తుంటే.. సంపత్ మాత్రం ఇలా కాలక్షేపం చేయాల్సివస్తోంది. ఎప్పటికి సెట్ అవుతాడో ఏంటో??