భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందరి ద్రుష్టిలో పడింది సంయక్తమీనన్. ఆ ఈవెంట్ లో ఆమె స్పీచ్ త్రివిక్రమ్ ని గుర్తు చేసింది. ఈ ఈవెంట్ లో సంయుక్త కూడా త్రివిక్రమ్ ని మోసేసింది. ఆయనే నాకు గురువని ప్రకటించింది. భీమ్లా నాయక్ తర్వాత ‘సార్’ సినిమాలో అవకాశం అందుకుంది. దిని వెనుక కూడా త్రివిక్రమ్ సిఫార్స్ వుందని వార్తలు వినిపించాయి. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్, సంయుక్తని తీసుకున్నారని టాక్ వినిపించింది. ఐతే ఇది కేవలం రూమర్ మాత్రమే. దినిపై క్లారిటీ ఇచ్చింది సంయుక్త.
”త్రివిక్రమ్- మహేష్ సినిమాలో నేను వున్నాననేది స్వీట్ రూమర్ మాత్రమే. ఇందులో వాస్తవం లేదు. నేను మహేష్ గారి సినిమాలో లేను. నిజానికి ఇలాంటి రూమర్ రాయాలంటే చాలా క్రియేటివి కావాలి. ఇదే కాదు.. సార్ సినిమా షూటింగ్ లో నాకు ధనుష్ కి విభేదాలు వచ్చి నేను సెట్స్ నుండి వేల్లిపోయాని కూడా రాశారు. నిజానికి ఇలాంటి రూమర్ ఎలా పుట్టిస్తారో తెలీదు కానీ వారి సృజనని మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు రూమర్ విని భయం వేసేది. ఇప్పుడు మాత్రం రూమర్స్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నా” అని చెప్పుకొచ్చింది సంయుక్త.