పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల మాటలు చాలా తక్కువ.”అందరికీ థ్యాంక్స్. పవన్ సర్ తో సినిమా చేయడం నా కల. ఆ కల తీరింది. లవ్ యు ఆల్” అని స్టేజ్ దిగిపోతారు. మహా అయితే ఇంకో రెండు మాటలు. కానీ ‘భీమ్లా నాయ’క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రికార్డ్ బ్రేక్ అయిపొయింది. హీరోయిన్ సంయుక్త మీనన్ రికార్డ్ బ్రేకింగ్ స్పీచ్ ఇచ్చింది. దాదాపు ఐదు నిమిషాలకు పైనే మాట్లాడింది.
పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో ఒక హీరోయిన్ ఇంత మాట్లాడటం ఇదే మొదటిసారి అనుకోవాలి. మొదట తెలుగులో స్పీచ్ మొదలుపెట్టింది. తర్వాత ఇంగ్లీష్. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుండి భీమ్లా నాయక్ వరకు పవన్ వికిపీడీయా అందుకుంది. ఇక పొగడ్తల గురించి చెప్పనవసరం లేదు. అక్కడితో ఆగలేదు. ఒక దర్శకుడు తన టీం గురించి చెప్పినట్లు కెమరా మెన్ నుంచి మొదలుపెట్టి .. సెట్ బాయ్ వరకూ అందరికీ థ్యాంక్స్ చెప్పింది. అక్కడితో ఆగలేద.. మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది.
పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ మధ్యలో గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం అందుకుంది. ఒక దశలో ఎక్కడ ఆపుతుందో అర్ధం కాక యాంకర్ సుమ కాస్త టెన్షన్ పడింది. తమన్ అయితే తన కీ బోర్డ్ తో ఇక చాలు అనే సిగ్నల్స్ కూడా ఇచ్చాడు. చివరికి… మొత్తానికి,… ఆపింది. సంయుక్త స్టేజ్ దిగాక మైక్ అందుకున్న సుమ.. ”ఈ అమ్మాయి ఇంత మాట్లాడాటానికి కారణం.. ఆ అమ్మాయిది మా ఊరే. మేము కొంచెం ఎక్కువే మాట్లాడతాం” అని నవ్వేసింది. మొత్తానికి భీమ్లా నాయక్ ఈవెంట్ లో సంయుక్త స్పీచ్ అదోరకమైన వెరైటీగా నిలిచిపోయింది.