విజయ్ దేవరకొండ నటిస్తున్న తెలుగు, తమిళ సినిమా ‘నోటా’. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో ఈ హీరోకి ప్రేక్షకుల్లో స్పెషల్ ట్రీట్మెంట్ దక్కుతోంది. అదే అతడికి తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేసే ఛాన్స్ తెచ్చింది. విక్రమ్ ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్. తాజాగా మరో భామను సినిమాలో కీలక పాత్రకు తీసుకున్నారు. ఆమె సంచనా నటరాజన్. చెన్నైలో ఈ అమ్మాయి సూపర్ మోడల్. ‘ఐ యామ్ సఫరింగ్ ఫ్రేమ్ కాదల్’ షార్ట్ ఫిలింతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చూసి విజయ్ ‘నోటా’లో ఆమెకు దర్శకుడు ఛాన్స్ ఇచ్చార్ట. మొన్నటివరకూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కి వ్యతిరేకంగా తమిళ సినిమా పరిశ్రమ స్ట్రైక్ చేయడంతో సినిమా షూటింగులు జరగలేదు. స్ట్రైక్ ముగియడంతో మళ్ళీ మొదలయ్యాయి. తాజా షెడ్యూల్లో సంచనా నటరాజన్ జాయిన్ అవుతుందని సమాచారం.