ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక తవ్వకాలే జరగట్లేదని బుకాయిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తవ్వకాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎప్పటికప్పుడు నివేదికలు అందచేస్తూనే ఉంది. అందులో చాలా స్పష్టంగా ఫోటోలు వీడియోలతో సహా తవ్వకాల గురించి సుప్రీంకు నివేదిస్తున్నారు.
వాటి ఆధారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూనే ఉంది. కానీ తవ్వకాలు ఆగడం లేదు.ఎంత ఘోరం అంటే… కలెక్టర్లే.. తమ దగ్గర అసలు తవ్వకాలు జరగడం లేదని… ఎవరో రాసిచ్చినట్లుగా ఒకే ఫార్మాట్ లో జిల్లాల పేర్లు మార్చి… సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఎంత ఘోరమైన మాఫియానో దీన్ని బట్టి అర్థమైపోతుంది. కలెక్టర్లను కూడా మాఫియాలో భాగంగా మార్చేశారు.
అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతింటోందని గగ్గోలు రేగుతోంది.. ఓ డ్యామ్ కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ కొటట్టుకుపోవడానికి కారణం.. ఇసుక తవ్వకాలు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల నదుల్లో ఏర్పడిన గొయ్యిల కారణంగా వందల మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వానికి ఇసుక దోపిడి తప్ప మరో ఆలోచనే ఉండదు. సుప్రీంకోర్టు చెప్పినా ఏమీ మారడంలేదు.