ఏపీలో ఇసుక స్కాం ఇంతింత కాదని ఒక్కో విషయం బయటకు వస్తున్న కొద్దీ స్పష్టమవుతోంది. ఇసుక మొత్తం.. ఒకే సంస్థకు గతంలో కట్ట బెట్టారు. ఆ సంస్థ పేరు జేపీ వెంచర్స్. ఇసుక తో అసలు ఎలాంటి వ్యాపారం చేయని కంపెనీకి కట్టబెట్టారు. అది బినామీ కంపెనీ అని.. పేరు వాడుకున్నందుకు కొంత కమిషన్ చెల్లిస్తారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కంపెనీ నట్టేట మునిగినట్లుగా కనిపిస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా ఆ కంపెనీకి ఎన్జీటీ ఏకంగా 1908 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
ఈ విషయాన్ని చాలా కాలంగా గోప్యంగా ఉంచారు. తాజాగా బయటపడింది. అనుమతుల్లేకపోయినా.. కోర్టులు ఆదేశించినా విచ్చలవిడిగా ఇసుక తవ్వుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ అది సాఘుతూనే ఉంది. మధ్యలో జేపీ పవర్ వెంచర్స్ ను తప్పించారు. ప్రభుత్వ పెద్దల కుటుంబసభ్యుల చేతికి ఇసుక దందా వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు జేపీ వెంచర్స్ చెల్లించాల్సిన జరిమానాతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బ కాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడీ కంపెనీ నిండా మునిగిపోయినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా కేంద్ర కమిటీ ఎన్జీటేీకి రిపోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు సమర్పించబోతోంది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే ఆదేశాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి రేపుతోంది. గనుల శాఖ అధికారులు ప్రభుత్వం మారకుండానే జైలుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఇసుక దోపీడికి పాల్పడిన వారు హాయిగా ఉంటారు.. కమిషన్లకు కక్కుర్తి పడిన వారు జైలుకు వెళ్లబోతున్నారు.కంపెనీల్ని మూసేసుకోబోతున్నారు