ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్‌కిషన్. ‘రొటీన్ లవ్‌స్టోరి’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’, ‘టైగర్’ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి సక్సెస్‌లు సాధించారు. ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘ ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంలో నటిస్తున్నారు.దీనికి కాప్షన్, All Indians are My Brothers and Sisters.
అక్టోబర్ లో పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 18 నుండి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం లో విలక్షణమైన నటి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది అని నిర్మాత బోగాధి అంజిరెడ్డి అన్నారు.
నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది ’’ అన్నారు.
దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ ‘‘ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఈ సినిమాని మూడేళ్ళ క్రితమే సందీప్‌కి చెప్పాను. సినిమాలో నలభై ఐదు నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఫ్లై ఓవర్ సెట్ కూడా వేస్తున్నాం. ఈ నెల 18 నుండి రెగ్యలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సందీప్ కొత్తగా కనిపిస్తాడు’’ అన్నారు.
నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్, బ్రహ్మానందం, రవికిషన్, అలీ, తనికెళ్ళభరణి, రావు రమేష్, పృథ్వీ, సప్తగిరి తదితరులు.
సినిమాటోగ్రాఫర్: ఛోటా కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, మ్యూజిక్: మిక్కి జె.మేయర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆళ్ళ రాంబాబు, నిర్మాత: బోగాధి అంజిరెడ్డి, కథ, మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజసింహ తాడినాడ.