హిట్ కాంబినేషన్ని రిపీట్ చేయడం ఓ సంప్రదాయం. ఓ మార్కెట్ స్ట్రాటజీ. హిట్ ఉన్న హీరోలే దర్శకులకు, హిట్ కొట్టిన దర్శకులే హీరోలకు కావాలి కాబట్టి.. హిట్ కాంబో మళ్లీ మళ్లీ చూసే అవకాశం దక్కుతుంది. అయితే.. ఓ ఫ్లాప్ కాంబోని రిపీట్ గా చూసే అవకాశం అతి తక్కువ. అంత రిస్క్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ… సందీప్ కిషన్ ఆ రిస్క్ తీసుకున్నాడు.
సందీప్ కిషన్ – జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఇది వరకు `తెనాలి రామకృష్ణ` వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్. `నిను వీడని నీడను నేనే` తో హిట్ కొట్టి, కాస్త ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించిన సందీప్ – ఈ సినిమాతో మరో అడుగు వెనక్కి వేసినట్టు అనిపించింది. ఫ్లాపుల్లో ఉన్న నాగేశ్వరరెడ్డి కి ఛాన్స్ ఇచ్చి సందీప్ తప్పు చేశాడని అప్పుడే అనుకున్నారంతా. అయితే ఇప్పుడు మళ్లీ నాగేశ్వరరెడ్డితో పని చేయడానికి ఓకే చెప్పాడు సందీప్. వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఓ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో… వెంటనే సినిమా ఎందుకు చేస్తున్నాడన్నది ఓ క్వశ్చన్ మార్క్ గా మారింది. నాగేశ్వరరెడ్డి దగ్గర ఓ హిట్ సినిమా రీమేక్ కథ రెడీగా ఉందని, కేవలం ఆ కథపై నమ్మకంతో సందీప్ ఈ సినిమాకి ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి నాగేశ్వరరెడ్డి ఈసారైనా తనపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకుంటాడేమో చూడాలి.