‘ధమాకా’ తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఈ గ్యాప్ లో ఆయన నిర్మాతగా నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. అందరూ కొత్తవారితో చౌర్యపాఠం అనే సినిమాని నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ మెగాఫోన్ పట్టుకునే సమయం వచ్చింది. హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమా చేయబోతున్నారని టాక్. నక్కిన స్టయిల్ లో ఇదీ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రానికి ‘ ఓరి నాయనో ‘అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ధమాకాకి మాంచి మాస్ పాటలు ఇచ్చిన భీమ్స్ నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ. ఎకె ఎంటర్టైన్మెంట్, సామజవరగమన తీసిన హాస్య మూవీస్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే అధికారికం గా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయనున్నారు.