`అర్జున్‌రెడ్డి` తరవాత…. బాలీవుడ్ కి వెళ్లిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి, సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో సందీప్ తో సినిమా చేయడానికి హీరోలంతా రెడీగానే ఉన్నా, డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో సందీప్ మరోసారి బాలీవుడ్ కే వెళ్లిపోతాడని వార్తలొచ్చాయి. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ కాంబో అధికారికంగా ఖరారైంది. టీ సిరీస్ ఈ సినిమాని నిర్మించబోతోంది. కొత్త సంవత్సరంలో అంటే.. జనవరి 1 అర్థరాత్రి 12 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. అప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయి. `షుగర్ ఫ్యాక్టరీ` అనే కథ సందీప్ దగ్గర రెడీగా ఉంది. ఈసినిమాని మహేష్ లాంటి స్టార్ తో చేయాలని సందీప్ భావించాడు. అయితే కుదర్లేదు. ఇప్పుడు ఇదే కథని అటూ ఇటూ మార్చి బాలీవుడ్ లో తీసేస్తున్నాడని టాక్.