హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. బటర్ రింగ్ రోడ్ నిర్మించినప్పుడు అంత దూరం సిటీ విస్తరిస్తుందా అనుకున్నారు. కానీ ఆ బటర్ నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే ఆ లోపల మొత్తం జనాభాతో నిండిపోయింది. హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చేశాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆలోచన చేయాల్సి వచ్చింది. మరో పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తే..ఎక్కడి వరకూ విస్తరిస్తుందో ఊహించడం కష్టం.
ముంబై హైవే వైపు సంగారెడ్డితో హైదరాబాద్ కలిసిపోవడం ఖాయమని అనుకోవచ్చు. పటాన్ చెరు ఇప్పుడు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో భాగం అయిపోయింది. ఆ తర్వాత కంది వరకూ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుతో నిండిపోయింది. అవన్నీ అమ్మేసుకున్నారు కూడా . ఇప్పుడు సంగారెడ్డి చుట్టుపక్కల పూర్తి స్థాయి భూమ్ కనిపిస్తోంది. ఇళ్ల స్థలాలపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎక్కువగా సంగారెడ్డి వైపు చూస్తున్నారు. పదేళ్ల తర్వాత అక్కడ ఇళ్లు కట్టుకుని నివసించగలిగే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు. సిటీలోకి సులువుగా వచ్చిపోయేలా మెట్రో, ఎంఎంటీఎస్ వంటివి అందుబాటులోకి వస్తాయి.
రియల్ ఎస్టేట్ భూమ్ ఇప్పుడు స్తబ్దుగా ఉందంటే.. తర్వాత ఒక్క సారిగా హై రేంజ్ కు వెళ్తుందని అర్థం . తెలంగాణ ఏర్పడినప్పుడు మూడు,నాలుగేళ్లు స్తబ్దుగా ఉంది. తర్వాత నాలుగేళ్లలో ఎవరూ ఊహించనంతగా పెరిగింది. అలాంటి భూమ్ మరో మూడు, నాలుగేళ్లలో వచ్చే చాన్స్ ఉంది. ఇప్పుడు కొని పెట్టుకుంటే.. అప్పటికి రెట్టింపు అయినా ఆశ్చర్యం ఉండదు.