దర్శకురాలు సంజనారెడ్డి అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సంజనారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె మెదడకు ఇన్ఫెక్షన్ సోకిందని వార్తలొచ్చాయి. వీటిపై కోన వెంకట్ స్పందించారు. ”మా కరణం మల్లీశ్వరి దర్శకురాలు క్షేమంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారు. కేవలం వైరల్ జ్వరంగా బాధ పడుతున్నారంతే. మీ ఊహాగానాలు కట్టిపెట్టండి” అంటూ ట్వీట్ చేశారు. రాజుగాడు సినిమాతో సంజనారెడ్డి దర్శకురాలిగా మారింది. ప్రస్తుతం `కరణం మల్లీశ్వరి` బయోపిక్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రిప్ట్ అందింస్తున్నారు కోన వెంకట్.