సంజయ్‌దత్‌కు ఈమధ్య దక్షిణాదిన మంచి అవకాశాలే వస్తున్నాయి. ‘కేజీఎఫ్ 2’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాల్లో మెరిశాడు సంజయ్‌దత్. సాయిధరమ్ తేజ్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’లోనూ తనే విలన్ అనే టాక్ వినిపిస్తోంది. ‘రాజాసాబ్‌లో’ ఉండనే ఉన్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఉగాదిన ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రాంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం సంజయ్‌దత్ ని తీసుకొన్నారని సమాచారం. ‘రాజాసాబ్’లో ప్రభాస్ – సంజూ మధ్య మంచి రాపో కుదిరిందని, ప్రభాస్ సూచన మేరకే సంజూని ఈ సినిమాలో తీసుకొన్నారని టాక్.
మిగిలిన నటులతో పోలిస్తే సంజయ్‌దత్ చాలా కాస్ట్లీ. తన పారితోషికం హై రేంజ్లో ఉంటుంది. దాంతో పాటుగా తన స్టాఫ్‌ని కూడా చూసుకోవాలి. నిర్మాతలకు ఇదంతా భారమే. కాకపోతే సంజూ వల్ల హిందీ మార్కెట్ ప్లస్ అవుతుంది. పాత్రకంటూ ఓ గుర్తింపు దొరుకుతుంది. అందుకే సంజూని టీమ్ లోకి తీసుకొన్నారని తెలుస్తోంది. ప్రభాస్ – సందీప్‌రెడ్డి వంగా కాంబోకున్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ సినిమాలో సంజూ కూడా ఉంటే… మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కథానాయికగా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే ఓ పేరు ఖాయం చేస్తారు.