- ‘సంజు’ బీట్స్ ‘బాహుబలి-2’ కలెక్షన్స్…
- ‘బాహుబలి-2’ రికార్డులు బద్దలు కొట్టిన ‘సంజు’…
- ఇప్పుడు ‘సంజు’నే నంబర్-1… ‘బాహుబలి-2’ వసూళ్ల కన్నా ఎక్కువ…
ట్విట్టర్ ఐడీలు, వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్… వివిధ మీడియాల్లో ఈ తరహా హెడ్డింగులు కనిపించాయి. రణ్‌బీర్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ బయోపిక్ కావడంతో చాలామంది సినిమాకి వెళ్లాలనుకోవడం ఒక కారణమైతే… విడుదల తరవాత పలు విమర్శలు రావడంతో సినిమాలో ఏముందో చూద్దామని పలువురు అనుకోవడం మరో కారణం. ఏతావాతా సినిమాకి సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయలను ‘సంజు’ కలెక్ట్ చేసింది. దీనికి తోడు పైన చెప్పినటువంటి వార్తలు చూసి పాఠకులు సైతం ‘బాహుబలి-2’ వసూళ్లను ‘సంజు’ అధిగమించి వుంటుందని నమ్మారు. అసలు విషయం మాత్రం వేరు.
‘బాహుబలి-2’ వసూళ్లను ‘సంజు’ అధిగమించిన మాట వాస్తవమే. అయితే… ఫస్ట్ వీకెండ్ వసూళ్లను అధిగమించలేదు. మూడో రోజు వసూళ్లను మాత్రమే అధిగమించింది. అదీ ‘సంజు’కి 20 లక్షలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్‌కి మూడో రోజు రూ. 46.50 కోట్లు వస్తే… ‘సంజు’కి రూ. 46.71 కోట్లు వచ్చాయి. అదీ సంగతి. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఎంతో తెలివిగా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తే చాలామంది వార్తలు రాసేశారు.
‘బాహుబలి-2’ ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసింది? ‘సంజు’ ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేసింది? అనేవి ఓసారి చూడకుండా… ఆలోచించకుండా… తరణ్ ఆదర్శ్ బుట్టలో పడి వార్తలు రాశారు. రెండిటి వసూళ్లు పోల్చి చూస్తే… తొలి మూడు రోజుల్లో ‘బాహుబలి-2’ కంటే ‘సంజు’ ఎనిమిది కోట్లు తక్కువ వసూలు చేసింది. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్‌కి తెలుగు, తమిళ, మలయాళ వసూళ్లు కలుపుకుంటే ‘సంజు’ దరిదాపుల్లోకి కూడా రాదు. ఇప్పట్లో ‘బాహుబలి-2’ రికార్డులకు వచ్చిన ముప్పేమీ లేదు. రాజమౌళి సినిమా రికార్డులు సేఫ్. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘సంజు’ రికార్డులకు ఎక్కుతుందంతే.
https://twitter.com/karanjohar/status/858959040700977152
#Sanju sets the BO on ???… Gets #JaaduKiJhappi from the audience… Collects ₹ 46.71 cr on Sun, MIND-BOGGLING… Has an EXCEPTIONAL ₹ ? cr+ opng weekend… Emerges HIGHEST OPENING WEEKEND of 2018… Fri 34.75 cr, Sat 38.60 cr, Sun 46.71 cr. Total: ₹ 120.06 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) July 2, 2018