2017 సంక్రాంతి సమరం ఎలా సాగిందో గుర్తింది కదా? ఓ వైపు చిరు, మరో వైపు బాలయ్య. ఒకరిది 150వ చిత్రం, మరొకరిది సెంచరీ సినిమా. మధ్యలో శర్వానంద్, ఆర్.నారాయణమూర్తి. వీళ్లని చూసి భయపడి వాయిదాలు వేసుకొన్న కొన్ని సినిమాలు. రోజుకో సినిమాతో సంక్రాంతి సీజన్ సూపర్ హిట్టయ్యింది.
2018లోనూ అదే సీన్ రిపీట్ అవుద్దనుకొన్నారు. మహేష్, బాలయ్య, పవన్, చరణ్… వీళ్లతో పాటు రజనీకాంత్ సినిమాలు కూడా 2018 సంక్రాంతికి వచ్చేస్తాయని భ్రమ పడ్డారు. తీరా చూస్తే… పవన్ కల్యాణ్ సినిమా తప్ప మరే సినిమా ఖరారు కాలేదు. బాలయ్య కూడా వచ్చేస్తాడు గానీ – డేట్ ఏంటన్నది తేలలేదు. మహేష్ బాబు సినిమా వేసవికి వెళ్లిపోయింది. చరణ్ కూడా డ్రాప్ అయ్యాడు. రోబో రావడం లేదు. దాంతో ఈసారి సంక్రాంతికి అంత మజా వచ్చేట్టు కనిపించడం లేదు. ప్రీ ప్లాన్ లేకపోవడం, అనుకొన్న సమయానికి సినిమాలు సిద్ధం కాకపోవడంతో ఈసారి సంక్రాంతి సీజన్ కళ తప్పేట్టు కనిపిస్తోంది. పొరపాటున పవన్, బాలయ్య సినిమాల్లో ఒకటి రెడీ కాకపోతే – ఈ సంక్రాంతి మరింత పేలవంగా సాగే ప్రమాదం ఉంది. సంక్రాంతి బరిలో పక్కాగా నిలిచే వి రెండు సినిమాలే. కాబట్టి చిన్న సినిమాలకు ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని ఎన్ని సినిమాలు ఉపయోగించుకొంటాయో మరి.