ఓ వైపు మద్దరు ధరలులేక రైతులు టామోటా, అరటి వంటి పంటల రైతులు దిగులు పడుతున్నారు. మరో వైపు నివార్ తుపాను వల్ల ఇతర పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల్ని ఆదుకోవాలంటూ.. టీడీపీ, జనసేన పోరుబాట పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం…పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనలు ఇచ్చింది. ఫుల్ పేజీ ప్రకటనల్లో…రైతులకు ముందే సంక్రాంతి వచ్చేసిందని ప్రకటించింది. కొద్ది రోజుల కిందట.. బీసీ సభ పెట్టి.. బీసీలకు ముందే సంక్రాంతి తెచ్చేశానని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ డైలాగ్‌ను రైతుల కోసం వాడుతున్నారు.
రైతులకు సంక్రాంతి పండుగ వచ్చేంతగా ప్రభుత్వం ఏం సాయం చేస్తోందంటే… నివార్ తుపాను బాధితులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తోంది. ఎంత అంటే.. ఆరు వందల కోట్లు. అసెంబ్లీలో తాము నిజాయితీగా పంట నష్టం అంచనా వేశామని ముఖ్యమంత్రి జగన్ ప్రకకటించారు. ఆ నిజాయితీ ప్రకారం.. రైతులకు ఆ కొద్ది మొత్తమే.. నష్టం జరిగిందని అనుకున్నారేమో కానీ అండే విడుదల చేస్తారు. అదే సమయంలో.. రైతు భరోసా కింద.. మూడో విడతలో విడుదల చేస్తామన్న నిధులు కూడా విడుదలచేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఏపీ సర్కార్ ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్ పథకం కింద.. ఆ నిధులను ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ చేశారు. పీఎం కిసాన్ పథకంలో 30 లక్షల మంది వరకు మాత్రమే రైతులు లబ్ది పొందుతున్నారు. మిగతా వారికి ఏపీ ప్రభుత్వం నిధులు జమ చేస్తుందో లేదో క్లారిటీ లేదు.
కేంద్రం ఇప్పటికే జమ చేసేసిన నిధులు… ఇన్పుట్ నష్టపరిహారం నిధులు ఆరు వందల కోట్లు… కలిపి పంపిణీ చేసి.. రైతుల్ని పండగ చేసుకోమని ప్రభుత్వం చెబుతోంది. అందు కోసం.. కోట్లకు కోట్లు ప్రకటనలకు వెచ్చిస్తోంది. నిజానికి ఏపీ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వరుసగా మూడు సార్లు పంట నష్టం జరిగింది. వాటికి సంబంధించిన పరిహారం ప్రభుత్వం అరకొరగా ఇచ్చింది. అంత భారీ నష్టం జరిగినప్పుడు కేంద్ర బృందాలు కూడా వచ్చి.. పరిశీలన జరిపి వెళ్లేంత భారీ నష్టం జరిగినప్పుడు.. రైతులకు భూరి సాయంచేసి.. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కానీ.. ఎలాంటి సాయం చేయకుండా.. అరకొర విదిలింపులు చేసి.. సంక్రాంతి పండగ చేస్కోండి అని ప్రభుత్వం వెటకారాలాడుతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.