కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో వందకోట్లు పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలతో కవిత అరెస్ట్ జరిగినా ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పోరేట్ మద్యం వ్యాపారం తెరవెనక నడిపించిన సంతోష్ రావును బీజేపీ ఎందుకు వదిలిపెట్టిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది.
2017లో స్పెషల్ జీవోతో కార్పోరేట్ మద్యానికి అనుమతులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ సర్కార్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తెరమీదకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను సీరియస్ గా తీసుకున్న బీజేపీ.. పన్నులు ఎగవేస్తూ, వంద కోట్లకు పైగా జీఎస్టీ ఎగ్గొట్టినా టానిక్ స్కామ్ ను ఎందుకు లైట్ తీసుకుందని…కేవలం దాని వెనకుండి నడిపించింది సంతోష్ రావు కాబట్టే వదిలేశారా..? అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
తన రాజకీయ ఎదుగుదలకు కవిత, కేటీఆర్ , హరీష్ రావు అడ్డుగా ఉన్నారనే ఫీలింగ్ తో సంతోష్ ఉన్నారన్న వాదనలను ఆ పార్టీని వీడిన నేతలు పలుమార్లు చెప్పారు. ఆ ముగ్గురిపై సంతోష్ నిఘా పెట్టారని, కేసీఆర్ అండ ఉండటంతో బీఆర్ఎస్ కార్యక్రమాలను తన కనుసన్నలోనే నడవాలని కోరుకునే వారని ఆరోపణలు వచ్చాయి.
కేటీఆర్ కు కూడా నెంబర్ 2 అవకాశం లేకుండా తనే ఆధిపత్యం చెలాయించాలని చూసేవారని…పార్టీలో ఎవరిని టార్గెట్ చేయాలి..? ఎవరిపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేయాలనేది సంతోష్ రావు డైరక్షన్ లోనే సాగిందన్న ప్రచారం రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలను చూసిన సంతోష్ కు లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలియదా..? తెలిసినా ఆయన ఎందుకు కేసీఆర్ కు సమాచారం చేరవేయలేదు..?అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
కవిత అరెస్ట్ జరిగిన తర్వాత కేటీఆర్ ,కవిత కుటుంబ సభ్యులు, హరీష్ రావు కూడా తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిసి ధైర్యం చెప్పి వచ్చారు. కానీ, ఇంతవరకు సంతోష్ కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో లిక్కర్ స్కామ్ లో కవితను ఇరికించింది సంతోషేనా..? అని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.