సంతోష్ శోభన్- మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ‘ఎక్ మినీ కథ’ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టే చిన్న కథతో చేసిన ఈ సినిమా అమోజాన్ ఓటీటీలో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రెడీ అయ్యింది. ఈ సినిమాకి వెరైటీ టైటిల్ పెట్టారు.అదే ‘లైక్ షేర్ సబ్స్క్రయిబ్’. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. టైటిల్ కి తగట్టే ఈ చిత్రం సోషల్ మీడియా చుట్టూ ఉండబోతుంది. ఇందులో సంతోష్ శోభన్ ఒక యూట్యుబర్ గా కనిపించనున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ హడావిడి బాగా పెరిగింది. చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేయడం ఒక కెరీర్ గా కూడా మార్చుకుంటున్నారు. కొంతమంది లైక్స్ షేర్స్ కోసం నానా తంటాలు పడుతుంటారు. సంబంధం లేని థంబ్ లైన్స్ పెట్టి సంచలనం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి అంశాలన్నీటిని జోడించి ఒక ఎంటర్ టైనర్ గా ఈ కథని తయారు చేశారని తెలిసింది. ఇందులో సోషల్ మీడియా పై సెటైర్లు కూడా ఉంటాయని సమాచారం. త్వరలోనే టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారు.