ఇండస్ట్రీ జనాలకు సంతోష్ శ్రీనివాస్ మరో సంపత్ నందిలా కనిపిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన సంతోష్ శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘రభస’ సినిమాలు చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో యేడాదిన్నర నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో మకాం వేశాడు. పవన్ సూచనల మేరకు కథను రెండుమూడు సార్లు మార్చాడు. గతంలో సంపత్ నంది కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా రెండేళ్ళు పవన్ కోసం కథ మీద వర్క్ చేసి చేసి… చివరకు రవితేజతో సినిమా తీశాడు. తర్వాత పవన్ కోసం రెడీ చేసిన కథతో గోపీచంద్ హీరోగా ‘గౌతమ్ నంద’ చేశాడని టాక్. అతడి సంగతి పక్కన పెడితే… పవన్ కోసం రెడీ చేసిన కథతో నాని హీరోగా సినిమా తీయాలని సంతోష్ శ్రీనివాస్ ట్రై చేస్తున్నాడట. నాని డేట్స్ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర వున్నాయి. వాళ్ళు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో నానితో సినిమా చేయాలనుకున్నారు. కాని కుదరలేదు. కిశోర్ తిరుమల ప్లేస్‌లో నానిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం సంతోష్ శ్రీనివాస్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ సినిమాలు చేసే ఆలోచనలో వున్నట్లు కనిపించడం లేదు. సంతోష్ శ్రీనివాస్ మాత్రం ఎన్నాళ్లు వెయిట్ చేస్తాడు. అందుకే, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని అదే కథతో నాని సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట!