బండి నారాయణ స్వామి రాసిన `సప్తభూమి` నవల విమర్శకుల, విశ్లేషకుల, సాహితీ అభిమానుల ప్రశంసలు అందుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నవల ఇప్పుడు దృశ్యరూపంలో రాబోతోంది. ఈ నవలకు సంబంధించిన హక్కుల్ని ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ నవలకు ఓ స్క్రిప్టు రూపం ఇస్తున్నారు. “సప్తభూమి నవల బాగా నచ్చింది. దాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలనుకుంటున్నా. సినిమా అయితే మరింత బాగుంటుందేమో అనే ఆలోచన కూడా ఉంది. వెబ్ సిరీస్ గా తీస్తే న్యాయం జరుగుతుందా? సినిమాగా తీస్తే న్యాయం జరుగుతుందా? అనేది ఆలోచించాలి“ అన్నారాయన. క్రిష్ `కొండపాలెం` అనే నవలను సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. చలం కథలు కొన్ని ఇప్పుడు సినిమాలుగా, వెబ్ సిరీస్‌లుగా రాబోతున్నాయి. మొత్తానికి… మనదైన సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది.