ఈతరం కమిడియన్లలో సప్తగిరి రేంజు వేరు. మారుతి సినిమాలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సప్తగిరి కెరీర్ చూస్తుండగానే హైపిచ్లోకి వెళ్లిపోయింది. రోజుకి లక్ష తీసుకొనే స్థాయికి ఎదిగేశాడు సప్తగిరి. బ్రహ్మానందం కెరీర్ డౌన్ ఫాల్లోకి వెళ్లడం కూడా సప్తగిరికి బాగా కలిసొచ్చింది. రోజుకి మూడు కాల్షీట్లతో సప్తగిరి లైఫ్ హాయిగా సాగిపోతోంది. అయితే సప్తగిరికి ఇప్పుడో ఆలోచన వచ్చిందట. హీరోగా అయిపోతే.. మన రేంజు ఇంకాస్త పెరిగిపోతుంది కదా? అనుకొన్నాడట. అందుకే సప్తగిరి హీరోగా ఓ సినిమా పట్టాక్కేసింది. షూటింగ్ కూడా గప్ చుప్‌గా సాగిపోతోందని, వెరైటీ టైటిల్ తో, ఇంకా వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీర్చిదిద్దుతున్నారని టాక్. అయితే ఈసినిమాని నిర్మాతలు కూడా సప్తగిరి స్నేహితులే కావడం విశేషం.
కమెడియన్లు హీరోగా మారడం కొత్తేం కాదు. అయితే అందులో విజయం సాధించినవాళ్ల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. సునీల్‌నే తీసుకొండి. దాదాపు పదేళ్లకు పైగానే కమెడియన్ గా అలరించాడు. ఆ తరవాతే హీరో అయ్యాడు. హీరో అయ్యాడు గానీ.. సునీల్‌కి పెద్దగా అచ్చు రాలేదు.క ళ్ల ముందే కొండంత రుజువుని పెట్టుకొని.. సప్తగిరికి హీరో అవ్వాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో మరి.