సరస్వతి పవర్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇరవై ఎకరాల మేర దళితులు ఇచ్చిన భూముల్ని అక్రమంగా జగన్ రెడ్డి బినామీలు కొనుగోలు చేశారు. తర్వాత వారు సరస్వతి పవర్‌కు అమ్మినట్లుగా పత్రాలు సృష్టించారు. ఈ వ్యవహారం విచారణలో వెలుగు చూడటంతో ఇరవై ఎకరాల మేర స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదట లబ్దిదారులకు నోటీసులు ఇచ్చారు. వారు తాము అమ్మేసుకున్న విషయంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేస్తారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ ను అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మితే వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సరస్వతి భూముల్లో అసైన్డ్ భూముల్ని మొదట కడపకు చెందిన వ్యక్తులు ఈ దళిత లబ్దిదారుల నుంచి కొనుగోలు చేశారు. బెదిరించి కొని ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు సరస్వతి పవర్‌కు భూములు అప్పగించారు. ఇప్పుడు వీటన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు.
ప్రభుత్వ అటవీ భూములు కూడా మూడు, నాలుగు వందల ఎకరాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో వాటిని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక రైతుల వద్ద నుంచి ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి లాక్కున్న భూముల వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రైవేటుగా కొనుగోలు చేసినందున ఆ భూములను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని రైతులకు మేులు చేసేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు