పల్నాడులో జగన్ రెడ్డి బూముల కోసమే పెట్టిన సరస్వతి పవర్ కంపెనీకి ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆ కంపెనీ అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఈ విషయం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది. మొత్తం పదిహేడు ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అటవీ భూములపై సర్వే ప్రారంభించింది. అందులో అటవీ భూములు కూడా మూడు, నాలుగు వందల ఎకరాలు ఉన్నాయని అంచనావేస్తున్నారు. ఆ భూముల్ని స్వాధీనం చేసుకోనున్నారు.
ఈ సరస్వతి పవర్ కంపెనీ సిమెంట్ ప్లాంట్ పెడతామని రైతుల వద్ద భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో వైఎస్ అధికారంలో ఉండటంతో ఎవరూ నోరు తెరవకుండా చేసి భూములు గుంజుకున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ అసలు ప్లాంటే పెట్టలేదు. భూములన్నీ అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎందుకు ప్లాంట్ పెట్టలేదంటే.. ఈడీ కేసుల్ని కారణంగా చెబుతున్నారు. అక్రమ సంపాదనకు ఎవరు పాల్పడమన్నారు.. ఆ డబ్బులతో ఎవరు భూములు కొనమన్నారు అన్న సందేహం అందరికీ వస్తుంది.
ఇష్టం వచ్చినట్లుగా ఆ కంపెనీకి లీజులు ఇచ్చుకున్నారు. గనులు, నీరు కేటాయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ లో షేర్ల కోసం జగన్ మోహన్ రెడ్డి తన తల్లి, చెల్లిపై కేసులు వేశారు. ఇప్పుడీ కంపెనీ వ్యవహారం మొత్తం చిక్కుల్లో పడుతోంది.