ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో వారసుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత అనూహ్యంగా జరిగిపోయిన ఈ పరిణామం తర్వాత శరత్ చంద్రారెడ్డికి ముందు జాగ్రత్తగా వై కేటగిరి సెక్యూరి్టీని కల్పించినట్లగా తెలుస్తోంది.
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా పూర్తి స్థాయిలో ఇరుక్కుపోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందరూ కలిసి స్కాం చేసినందున.. అసలు స్కాం ఎలా జరిగింది.. నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెడారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్, కవిత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆయన భార్య అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సౌత్ నుంచి కవిత, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని వీరు ముగ్గురికి ఢిల్లీలో వ్యాపారాలున్నాయని సీబీఐ ఈడీలు చెబుతున్నాయి. అందరూ కలిసే ఈ స్కాం చేశారని అంటున్నారు. చాలా కాలంగా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చేప్రయత్నం జరిగినా సాధ్యం కాలేదు కానీ.. అరబిందో ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ జోక్యంతో వారు అప్రూవర్ గా మారిపోయినట్లుగా తెలుస్తోంది.
కేసఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే.. జగన్.. తాను ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆయన కుమార్తెను చిక్కుల్లో పడేయడానికి కూడా వెనుకాడలేదన్న ఆగ్రహం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.