ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అస్సాం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి కోసం బీజేపీ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. గురువారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సర్బానంద సోనోవాల్ పేరును ఖరారు చేసింది. ఆయన నేతృత్వంలో అస్సాం ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుంది. ఆయన ప్రస్తుతం మోడీ మంత్రి వర్గంలో నైపుణ్య అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయన విద్యార్ధి దశ నుంచే మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. ఆయన 1992-99వరకు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఆ తరువాత అసోం గణపరిషత్ రాజకీయ పార్టీలో చేరారు. దానితో విభేదించి 2011 సం.లో బీజేపీలో చేరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. 2014 లోక్ సభ ఎన్నికలలో లక్ష్మీపూర్ నుండి పోటీ చేసి ఎన్నికయి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు అస్సాం ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపికయ్యారు.