పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఫస్ట్ డేనే చూసేయాలన్న ఉత్సాహం చూపించే ఫ్యాన్స్ ఎంతమందో? అందుకే పవన్ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తొలిరోజే రికార్డుల మోత మోగిపోతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ అదే జరిగింది. బెనిఫిట్ షోలకే డివైడ్ టాక్ వచ్చినా అభిమానులు పట్టించుకోలేదు. పవన్ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు క్యూ కట్టేశారు. దాంతో రికార్డులు బద్దలయ్యాయి. తొలి రోజే వసూళ్ల సునామీ వీచింది.
ఆంధ్ర తెలంగాణల్లో తొలి రోజు గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో మరో నాలుగు కోట్లకు పైగానే సాధించింది. బెంగళూరు, కర్నాటక కలుపుకొంటే మరో రూ.4 కోట్లు లెక్కతేలింది. అంటే అక్కడికే రూ.25 కోట్లు దాటేసిందన్నమాట. దుబాయ్, ఒమన్, షార్జా… ఇలాంటి చోట్ల కూడా షోలు పడ్డాయి. మొత్తం 42 దేశాల్లో ఈ సినిమాని విడుదల చేశారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి దాదాపుగా రూ.30 కోట్ల వసూళ్లు దక్కే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిజల్ట్ చూసి నిరుత్సాహపడుతున్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వసూళ్లు చూసి కాస్త.. రిలాక్స్ అవుతారేమో??